11-07-2025 12:00:00 AM
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
బాన్సువాడ, జులై 8 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం ఎంపీడీవో కార్యాలయంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అధికారులకు సూచించారు. గురువారం డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణ కొరకు ఎంపీడీవో కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
బాన్సువాడ ఎంపీడీవో కార్యాలయం లో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డివిజన్లోని అన్ని మండలాల వైద్య అధికారులు, ఎంపీడీవో, ఎంపీ ఓ, ఎం ఈ ఓ మున్సిపల్ కమిషనర్ లతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. మురికి నీరు నిల్వ ఉండకుండా చూడడం దోమల నివారణకు చర్యలు తీసుకోవడం డ్రైనేజీల నిర్వహణ చెత్త సేకరణ సమర్ధవంతంగా నిర్వహించడం.
శుద్ధమైన త్రాగునీరు, బ్లీచింగ్ పౌడర్, సరిగా కలపడం క్లోరినేషన్, వాటర్ పాగింగ్ మిషన్ల ద్వారా దోమల మందు స్ప్రే చేయాలన్నారు. పాఠశాలలలో,హాస్టల్స్ లలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రత గురించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అధికారులు, ప్రజలు డెంగ్యూ వ్యాధి గురించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పై ఎంపీడీవో, ఎంపీ ఓ ల తొ సమీక్ష సమావేశం నిర్వహించారు.