03-02-2026 02:03:10 AM
మీనాక్షి నటరాజన్
వెల్దండ ఫిబ్రవరి 2 కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి సైనికుల్లా పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ, ప్రభుత్వ పదవుల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ అన్నారు.సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో పర్యటన సందర్బంగా ఆమెకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకుల, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలను అభివృద్ధికి దూరం చేసే దిశగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజాపాలనలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు ప్రభుత్వ, పార్టీ పదవుల్లో పథకాలలో సముచిత న్యాయం జరగడం లేదని మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకురావడంతో సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పిసిసి సమన్వయ కర్త గంప వేణుగోపాల్, ఎన్‌ఎస్ యూఐ జాతీయ కార్యదర్శి అనులేఖ బోస, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతీలాల్ నాయక్, కిసాన్ సెల్ తాలూకా అధ్యక్షులు పర్వత్ రెడ్డి, సర్పంచ్ మట్ట యాదమ్మ , కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపతి రెడ్డి, వెంకటయ్య గౌడ్ తక్కళ్ళపల్లి శేఖర్, ఎర్ర శ్రీను ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్, రాజశేఖర్, ముదిగొండ రమేష్, పుల్లయ్య, పురుషోత్తమచారి, హమీద్, వెంకటరెడ్డి, రషిద్, భరత్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.