12-01-2026 12:52:30 AM
కరీంనగర్, జనవరి 11 (విజయ క్రాంతి): ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఆదివారం కరీంనగర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పిఆర్టియూ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు విద్యా రంగానికి సంబంధించి అనేక సమస్యలను పరిష్కరించిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు గోనె శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కేతిరి తిరుపతిరెడ్డి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాతూరి రాజ్ రెడ్డి, పి ఆర్ టి యూ తెలంగాణ రాష్ట్ర, జిల్లా నాయకులు నరహరి రామ్ రెడ్డి, చొల్లేటి శ్రీనివాస్, పులిపాక కిషన్, నరుకుల్ల శ్రీధర్, మండల ఆనందం, చిందం రమేష్ ,గొడిశాల మహేందర్, భూక్య ఉమాపతి, చొల్లూరి రామకృష్ణ, ప్రశాంత్ పాల్గొన్నారు.
పల్లెల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
చొప్పదండి, జనవరి11(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం ఇస్లాంపూర్ గ్రామం లో రూ. 20 లక్షలతో నిర్మిస్తున్న నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పల్లెల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని గుర్తు చేశారు. గ్రామాల్లో సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇబ్బందులకు గురి చేసిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో గొప్పదండి నియోజకవర్గం లోని ప్రతి పల్లెను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. స్థానిక సర్పంచ్ బారాజు ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ సుంకే రవిందర్, స్థానిక ఎమ్మార్వో రజిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్,వెలిచాల తీర్మల్ రావు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు నగేష్, రాజిరెడ్డి, అజయ్‌రావు పాల్గొన్నారు.