12-01-2026 12:54:15 AM
పోలీస్ కమీషనర్ సాయి చైతన్య హెచ్చరిక
నిజామాబాద్, జనవరి 11, (విజయక్రాంతి): సంక్రాంతి పండగ నేపథ్యంలో కోడిపందాలు, పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు.నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామా బాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో పేకాట, కోడిపందాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని సీపీ స్పష్టం చేశారు.
నిరంతర వాహన తనిఖీలు, సరిహద్దు సునీత ప్రాంతాలను గుర్తించామ ని ఆ ప్రదేశాలలో గస్తీని మరింత ముమ్మరం చేసామన్నారు. మహారాష్ట్ర, నిజామాబాద్ అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. పట్టుబడిన నిందితులపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులందరికి ఆదేశాలు జారీ చేశామ న్నారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్ప డే వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు.