11-10-2025 06:43:17 PM
పటాన్ చెరు: పటాన్ చెరు పరిధిలో అడ్వకేట్ విజయ్ భాస్కర్ స్థాపించిన విజయ్ లీగల్ అసోసియేట్స్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాదిరి పృథ్వీరాజ్ అతిథిగా పాల్గొని తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాదిరి పృథ్వీరాజ్ గమాట్లాడుతూ.. న్యాయ సేవలను సామాన్య ప్రజలకు సులభంగా, పారదర్శకంగా అందించే లక్ష్యంతో ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన అడ్వకేట్ విజయ్ భాస్కర్ కి అభినందనలు తెలిపారు. న్యాయ రంగంలో మరింత సేవా దృక్పథంతో ముందుకుసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రావు, బి ఎస్ పి శంకర్, తదితరులు పాల్గొన్నారు.