calender_icon.png 12 October, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీసీకి కంపెనీలో చోరీకి పాల్పడిన నిందితులు అరెస్ట్..

11-10-2025 06:40:42 PM

మనోహరాబాద్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం జీడిపల్లి ఐటీసీ కంపెనీలో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను తూప్రాన్, మనోహరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత సెప్టెంబర్ మాసంలో మండలంలోని ఐటిసి కంపెనీలో పది లక్షల విలువ కలిగిన సిగరెట్ బాక్సులు, ఎనిమిది లక్షల నగదు, మూడు వాహనాలు చోరీకి గురయ్యాయి.

బుధవారం మనోహరాబాద్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అక్కడున్న వాహనాలకు సరైన పత్రాలు లేకపోవడంతో అనుమానం వచ్చి ఇద్దరు నిందితులను, వాహనాలను అదుపులోకి తీసుకోని విచారించగా ఐటీసీ కంపెనీలో చేసిన చోరీకి మేమే బాధ్యులమని నిందితులు ఇద్దరు ఒప్పుకోవడం జరిగింది. గతంలో ఈ ఇద్దరు నిందితులు పలు చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. ఇద్దరు నిందితులు మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లి గ్రామానికి చెందిన మైదారబోయిన శ్రీకాంత్ 31, చిట్టి మహేష్ కోనాయిపల్లి పిబి, గ్రామాలకు చెందినవారు. దురు వ్యసనాలకు బానిసలై ఫైనాన్స్ లో డబ్బులు పోగొట్టుకొని జీడిపల్లి ఐటిసి కంపెనీలో పనిచేస్తూ చోరీకి పాల్పడినట్టు ఒప్పుకున్నారు.