11-10-2025 06:44:13 PM
ముకరంపురా,(విజయక్రాంతి): స్థానిక కరీంనగర్ లోని సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ప్రపంచ పోస్టల్ దినోత్సవం సందర్భంగా బోనగిరి మహేష్ పోస్ట్ ఆఫీస్ వలన ఉపయోగాలను వివరించారు . పోస్ట్ ఆఫీస్ పథకాలు ఎంతో కాలంగా అందుబాటులో ఉన్న మంచి పొదుపు సాధనాలు దీర్ఘకాలంలో మంచి రాబడి సాధించాలనుకునే వారికి ఇవి ప్రయోజనకరంగా ఉంటాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి, కొత్తూరి ముకుందo, ఆచార్యులు పాల్గొన్నారు. ఇలాంటి వాటి పట్ల అవగాహన కలిగించినందుకు ఇంజనీర్ కోల అన్నారెడ్డి, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, ఎలగందుల సత్యనారాయణ, రాపర్తి శ్రీనివాస్, కొత్తూరి ముకుందo, గోలి పూర్ణచందర్, డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్, నడిపెల్లి దీన్ దయాళ్ రావు, అప్పిడి వకలాదేవి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.