calender_icon.png 12 January, 2026 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబరాన్నంటిన సంక్రాంతి సంబురం

12-01-2026 12:00:00 AM

ముగ్గులను సందర్శించిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి

మేడిపల్లి,జనవరి 11 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిహెచ్‌ఎంసి పరిధిలోని బోడుప్పల్ సర్కిల్, పీర్జాదిగూడలో బీఆర్‌ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నిర్మల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆదివారం ఘనంగా జరిగాయి. రంగురంగుల ముగ్గులతో ప్రాం తం పండుగ వాతావరణంతో కళకళలాడింది.ఈ ముగ్గుల పోటీలను మాజీ మంత్రి, మేడ్చల్ శాసన సభ్యులు చామకూర మల్లారెడ్డి, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి సందర్శించి పాల్గొన్న మహిళలను అభినందిం చారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధా న కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, దొంతిరి హరిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.