01-08-2025 12:00:00 AM
కరీంనగర్, జూలై 31 (విజయ క్రాంతి): జూలైలో ఆశాజనకంగా వర్షాలు కురిసినప్పటికీ గోదావరి, మానేరు ప్రవాహం లేకపోవడంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రాజెక్టులకు వరదనీరు అంతంత మాత్రంగానే చేరు తుంది. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు గోదావరి ఉ ప్పొంగుతుంది.
తద్వారా బాబ్లీ ప్రాజెక్టు నుం డి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగి ఉ మ్మడి జిల్లా పరిధిలోని ఇతర ప్రాజెక్టులకు నీరు చేరుకుంటుంది. ఈసారి మహారాష్ట్రలో వర్షాలు కురిసినా నాసిక్ ప్రాంతంలో అం తంత మాత్రంగా కురియడంతో గోదావరి ఉ ప్పొంగలేదు. అటువైపు కడెం ప్రాజెక్టు నిండకపోవడంతో ఎల్లంపల్లికి ప్రవాహం తగ్గింది.
ఉమ్మడి జిల్లా పరిధిలోని శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు, అప్పర్ మానేరు, లోయర్ మానేరు, అనంత సాగర్ ప్రాజెక్టులలో ప్రస్తు తం నీటి మట్టం అంతంత మాత్రంగానే ఉంది. ఆగస్టులో ఆశాజనంగా వర్షాలు కురి సి గోదావరి ఉప్పొంగకుంటే ఈ ప్రాజెక్టులు నిండని పరిస్థితి నెలకొంటుంది. ప్రాజెక్టులు నిండకుంటే వచ్చే రబీలో సాగు, తాగునీటికి కష్టమనే చెప్పాలి.
- ప్రాజెక్టుల వారీగా...
ఉమ్మడి జిల్లాకు జీవనది అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం మొత్తం 38.41 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇన్ ఫ్లో కేవ లం 5990 క్యూసెక్కులు కొనసాగుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న ఉ మ్మడి జిల్లా పరిధిలోని మిడ్ మానేరులో కేవలం 7.38 టీఎంసీల నీరు మాత్రమే ఉం ది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 27.55 టీఎంసీ లు, ఇన్ ఫ్లో 630 క్యూసెక్కులు మాత్రమే.
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని అప్పర్ మానేరు డ్యాం నీటి సామర్థ్యం 2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1 టీఎంసీ మాత్రమే ఉంది. దీనికి ఇన్ ఫ్లో లేదు. అలాగే అన్నపూర్ణ రిజర్వాయర్ నీటి సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.27 టీఎంసీల నీరు మాత్ర మే ఉంది. ఈ ప్రాజెక్టుకు కూడా ఇన్ ఫ్లో లే దు. కరీంనగర్ జిల్లా పరిధిలోని ఎల్‌ఎండీ రి జర్వాయర్ ద్వారా వరంగల నుంచి నల్గొండ జిల్లా వరకు సాగు, తాగునీరు అందిస్తుంటా రు.
అయితే ఎస్సారెస్పీ నిండకపోవడం, వ రద కాలువ ద్వారా నీటి లభ్యత లేకపోవడం, మానేరు నది ఉప్పొంగకపోవడం తో ప్రాజెక్టులో నీరు ఆశాజనకంగా రాలే దు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 24.034 టీ ఎంసీలు కాగా ప్రస్తుతం 6.681 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇన్ ఫ్లో కేవలం 214 క్యూసెక్కులు మాత్రమే.
పెద్దపల్లి జిల్లా పరిధిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి సా మర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.758 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇ న్ ఫ్లో 5886 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రా జెక్టులోనే నీటి నిల్వ ఆశాజనకంగా ఉంది. క డెం ప్రాజెక్టు నిండినా, గోదావరి ఉప్పొంగి నా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నరద నీరు వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టు నుండి ఎన్టీపీసీకికూడానిరంతరం నీటిసరఫరాఉంటుంది.