calender_icon.png 2 August, 2025 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..

01-08-2025 12:00:00 AM

చర్ల, జూలై 31 (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం పర్యటన. చర్ల మండలం విజయ కాలనీ గ్రామంలో పర్యటించిన సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మచ్చ రామారావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు. అయి సుమారు 18 నెలలు అయిన అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందనా ఉందని, విజయ కాలనీ గ్రామ సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని అన్నారు.

గ్రామంలో విద్యుత్ సౌకర్యం సరిగా లేదని,మంచినీటి కొరత ఎక్కువగా ఉందనీ, మిషన్ భగీరథ అధికారులు చొరవ తీసుకొని తక్షణమే గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చిప్పనపల్లి రమేష్ ఇంటి నుండి చివరి వరకు విద్యుత్ స్తంభాలు నిర్మించాలని ఉన్నతాధికారులను కోరారు. ఇప్పటికే మండలంలో అనేక గ్రామాలు సందర్శించామని ప్రతి గ్రామంలో కుప్పల గుప్పలుగా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని, వెంటనే ప్రభుత్వ అధికారులు స్థానిక అధికారులు చొరవ తీసుకొని సమస్యల పరిష్కారం పై దృష్టి సారించి.

తక్షణమే పరిష్కరించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు. ఉడుగుల సారోను వరదల వరలక్ష్మి    గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు.