31-07-2025 11:19:15 PM
- మర్రిగూడ ఎంపీడీవో మునయ్య కు షో కాజ్ నోటీసులు జారీ
- భూభారతిపై కూడా జిల్లా కలెక్టర్ సమీక్ష
- జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
మునుగోడు,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కార్యక్రమంలో అనర్హులను ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో చేర్చవద్దని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో భూభారత్ పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.చండూరు డివిజన్లో సోమవారం నాటికి ఇండ్ల గ్రౌండింగ్ 50 శాతం పురోగతి తీసుకురావాలని చెప్పారు. ఇళ్లు మంజూరై కట్టుకునేందుకు ఆర్థికంగా స్తోమత లేని లబ్ధిదారులను గుర్తించి స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా రుణం ఇప్పించేలా ప్రోత్సహించాలని తెలిపారు.ఎల్ 3 నుండి ఎల్ 1 కు వచ్చే లబ్ధిదారుల జాబితా పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఎట్టి పరిస్థితులలో జాబితాలో అనర్హులు రావడానికి వీలులేదని తెలిపారు.
మర్రిగూడ ఎంపీడీవో మునయ్యకు షో కాజ్ నోటీసులు జారీ..
ఇండ్ల గ్రౌండింగ్ లో నిర్లక్ష్యం వహించడంతోపాటు,పి ఎం ఏవై గ్రామీన్ ఆన్ లైన్ ఎంట్రీ వివరాల నమోదులో కూడా నిర్లక్ష్యం వహించిన కారణంగా మర్రి గూడ ఎంపీడీవో మునయ్య కు షో కాజ్ నోటీసులు జారీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.చండూరు డివిజన్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా మర్రిగూడ ఎంపీడీవో మునయ్య ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ లో నిర్లక్ష్యం వహించారని,తప్పనిసరిగా నమోదు చేయాల్సిన వివరాలను సైతం ఆన్లైన్లో నమోదు చేయడం లేదని తెలిపారు. అందువల్ల షో కాజ్ నోటిస్ జారీ చేసినట్లు తెలిపారు. సమీక్ష అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిఖంగా తనిఖీ చేసి వైద్య కేంద్రం ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, ఓపి, మందులు స్టాక్ రిజిస్టర్ ను, ఇతర వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలోచండూరు ఆర్డీవో శ్రీదేవి , గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, ఎంపీడీవో, తహసిల్దార్, ఇతర అధికారులు ఎంపీడీవోలు,పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.