18 April, 2026 | 3:51 PM

బదిలీల తర్వాతనే ప్రమోషన్లు ఇవ్వాలి

20-06-2025 12:00 AM

విద్యాశాఖ డైరెక్టర్‌కు ‘తపస్’ విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): గెజిటెడ్ -2 హెచ్‌ఎం పోస్టులు వెంటనే భర్తీచేయాలని, అలాగే స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలకు బదిలీలు, పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు, నవాత్‌సురేశ్ గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు.

పదవీ విరమణ ద్వారా చాలా ఖాళీలు ఏర్పడ్డాయని,  వాటిని వెంట నే భర్తీ చేయడం ద్వారా విద్యావ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి 30 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులుండేలా చర్యలు తీసుకోవాలని, 31 నుంచి 60వరకు కనీసం ముగ్గురు ఉపాధ్యాయులు, 60 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్నచోట తరగతికి ఒక ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేయాలని కోరారు.