20-09-2025 12:00:00 AM
ఒకరి పరిస్థితి విషమం
బూర్గంపాడు, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) : తల్లి ఆస్తి, నగల కోసం ఇద్దరు అన్నదమ్ములు మధ్య ఘర్షణ జరిగిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మం డలం లక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. బూర్గంపాడు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం... ఆసుల నాగిరెడ్డి, ఆసుల రామకృష్ణారెడ్డి అన్నదమ్ములు వ్యవసా యం చేసుకుంటూ జీవిస్తున్నారు. గత కొంత కాలంగా ఇరువురి మధ్య తల్లి వద్ద ఉన్న ఆస్తి, బంగారం కోసం గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన వివా దంలో అన్న నాగిరెడ్డి భార్య పద్మ, కుమారుడు అంజిరెడ్డి లపై రామకృష్ణ రెడ్డి నాపరాయి బండతో తల పై కొట్టడంతో అంజిరెడ్డి గాయాలు కాగా, పద్మకు తీవ్రగాయం కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంజిరెడ్డి ఫిర్యాదు తో దాడికి పాల్పడిన వారిపై బూర్గంపాడు ఎస్‌ఐ మేడా ప్రసాద్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.