calender_icon.png 29 July, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత కార్మికుల రుణమాఫీకి ప్రతిపాదనలు..

28-07-2025 08:49:25 PM

వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలోని చేనేత కార్మికులు 2017 ఏప్రిల్ 1 నుండి మార్చి 31, 2024 మధ్య కాలంలో తీసుకున్న చేనేత రుణాల మాఫీ కొరకు జిల్లా కమిటీ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి చేనేత కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. 2017 ఏప్రిల్ నుండి మార్చి 2024 మధ్య కాలములో చేనేత రుణాలు తీసుకున్న 252 కార్మికులకు సంబంధించిన రుణాలు రూ. 2,04,32,800 లను మాఫీ చేసేందుకు కమిటి ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. 

అదేవిధంగా ఇదే కాలంలో చేనేత రుణాలు పొంది మొత్తం రుణం తిరిగి చెల్లించిన 86 మంది కార్మికులకు సైతం రూ. 49,67,800 లు రుణమాఫీ చేసి కార్మికుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించారు. ఏప్రిల్ 1, 2017 నుండి మార్చి 2024 మధ్య కాలంలో చేనేత రుణాలు తీసుకొని తిరిగి చెల్లించి న కార్మికులు ఇంకా ఎవరైనా ఉంటే వారికి సైతం వారు తీసుకున్న రుణానికి అనుగుణంగా రూ. ఒక లక్ష వరకు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని,  రుణాలు తీసుకొని బ్యాంకులకు పూర్తిగా  చెల్లించిన వారి వివరాలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ఎ.డి హ్యాండ్లూమ్ గోవిందయ్య ను ఆదేశించారు. ఈ సమావేశంలో చేనేత శాఖ డి.డి.పద్మ, ఎ.డి గోవిందయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, డిప్యూటీ ఎల్.డి.యం. సాయి కుమార్, కో ఆపరేటివ్ శాఖ నుంచి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.