25-08-2025 01:01:34 AM
-సమస్యలపై పోరాడుదాం
-టీడబ్ల్యూజేఎఫ్ రాష్ర్ట అధ్యక్షుడు మామిడి సోమయ్య
నిర్మల్, ఆగస్టు 24 (విజయక్రాంతి): సమాజంలో పడిపోతున్న జర్నలిజం విలువలను కాపాడుకుంటూ జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ర్ట అధ్యక్షుడు మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. సంఘంలోని బాధ్యులంతా సమిష్టిగా ఎప్పటికప్పుడు జర్నలిస్టులకు అండగా ఉండాలని, సంఘాన్ని మరింత బలోపేతం చేయాల ని కోరారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో జరిగిన టీడబ్ల్యూజే ఎఫ్ నిర్మల్ జిల్లా ద్వితీయ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ, జర్నలిస్టుల పట్ల పాలకులు వివక్ష చూపుతున్నారని, ఈ వైఖరిని ఐక్యంగా తిప్పికొట్టాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించక పోగా జర్నలిస్టులను దూషించడం, అవమానించడంలో కేసీఆర్ ను మించిపోతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ర్ట వ్యాపితంగా ఆందోళన తప్పదని ఆయన హెచ్చరిం చారు. ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును సాకు గా చూపి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా తప్పించుకోవడం సరైంది కాదని అన్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మిట్టపల్లి మధు, గడ్డం సత్యగౌడ్, ఉపాధ్యక్షుడు కామెర వెంకటస్వామి, సంయుక్త కార్యదర్శి ఇప్ప సురేష్, కోశాధికారి సబ్బని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
టీడబ్ల్యూజేఎఫ్ నిర్మల్ జిల్లా కమిటీ ఎన్నిక
టీడబ్ల్యూజేఎఫ్ తృతీయ మహాసభలో నిర్మల్ జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా జగన్నాథం శ్రీనివాస్‌చారి (ప్రజాద ర్బార్), ఉపాధ్యక్షుడిగా జాదవ్ పవన్(ఐ న్యూ స్), రాజు ముదిరాజ్(నేటివార్త) మల్లేష్, కార్యదర్శి శేషగిరి రాజు(సూర్య), సంయుక్త కార్య దర్శులు మల్లేష్(ప్రజాదర్బార్), రాజేశ్వర్ గౌడ్ (సూర్య), కోశాధికారిగా ఎ.శంకర్, కార్యవర్గ సభ్యులుగా నారాయణ, సాయినాథ్, రాష్ర్ట కౌ న్సిల్ సభ్యులుగా మురళీగౌడ్, దుర్గాప్రసాద్, ఎ.శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. జిల్లా నూతన కార్యవర్గానికి రాష్ర్ట అధ్యక్ష, కార్యదర్శులు మామిడి సోమయ్య, తన్నీరు శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.