calender_icon.png 24 January, 2026 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి కోసం నిరసన

24-09-2024 01:24:07 AM

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీకి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని స్థానికులు సోమవారం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులకు చెబితే ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అధికారులు స్పందించి గ్రామ ప్రజలకు ట్యాంకర్ దారా నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు.