calender_icon.png 24 January, 2026 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు ఢీ.. రెండు ముక్కలైన ట్రాక్టర్

24-09-2024 01:24:58 AM

నల్లగొండ, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ట్రాక్టర్ రెండు ముక్కలైంది. నల్లగొండ జిల్లా వేముపల్లి మండలం రావువారిగూడెం శివారులో సూర్యాపేట రహదారిపై సోమవారం ఈ ఘటన జరిగింది. రావువారిగూడేనికి చెందిన ఓ రైతు ట్రాక్టర్‌ను రోడ్డు పక్కన నిలిపాడు. సూర్యాపేట వైపు నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న కారు అతివేగంతో దూసుకొచ్చి ట్రాక్టర్‌ను ముందు నుంచి ఢీకొట్టింది. కారు ఢీకొన్న వేగానికి ట్రాక్టర్ రెండు భాగాలుగా విడిపోయింది. ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదం తప్పింది.