calender_icon.png 22 October, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య కార్మికులకు ఆదర్శ్ యూత్ అసోసియేషన్ సన్మానం

21-10-2025 10:15:49 PM

మేడిపల్లి (విజయక్రాంతి): దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ తిరుపతి రెడ్డి, మేడబోయిన విజయ్ కుమార్ ముదిరాజ్ సమన్వయంతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సమాజ స్వచ్ఛత కోసం ప్రతిరోజూ కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ, దీపావళి పర్వదినం సందర్భంగా సత్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడబోయిన బాల నరసింహ ముదిరాజ్, రావుల మధుసూదన్, మాడిశెట్టి ఎల్లయ్య, తునికి కోటయ్య, పోలీస్ సురేందర్ రెడ్డి, మంగళారపు శ్రీనాథ్, అక్కల శ్రీనివాస్, మిరియాల శ్రీనివాస్, చలపతి రెడ్డి, గొడిశాల రఘు, మేడబోయిన బాలకృష్ణ, బండారి బాలాజీ, కడారి అంజి తదితరులు పాల్గొన్నారు.