calender_icon.png 22 October, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలగిరి చౌరస్తాలో సందడి చేసిన ఎమ్మెల్యే సామేలు

21-10-2025 10:13:45 PM

ఉద్యమం చేసే రోజుల్లో, ఈ జగదాంబ షాపులోనే టీ తాగాను..

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళుతూ, గతంలో గడిచిన రోజుల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో ఉద్యమ నాయకుడిగా ఇన్చార్జి చేసే రోజుల్లో సైతం ఈ షాపులోనే టీ తాగానని గుర్తు చేస్తూ, మంగళవారం మరోసారి తిరుమలగిరి చౌరస్తాలో టీ తాగుతూ సందడి చేశారు. నాడు ఉద్యమ సమయంలోను, గిడ్డంగుల శాఖ చైర్మన్ పదవిలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఎమ్మెల్యే మందుల సామెల్ అంటే సదా సీదా నాయకుడు అనే పేరుంది. ఎక్కడ ఎలాంటి పర్యటనకు వెళ్లి, ఆయన అక్కడి ప్రజల్లో తొందరగా మమేకం అయిపోతారు. వరసలు పెట్టి అందరితో కలుపుగోలుగా మాట్లాడుతారు. ఆయన ఎంత సింపుల్‌ నాయకుడు మరోసారి నిరూపించుకున్నారు. ప్రజల్లో ఉండే నాయకుడు సామాన్య నాయకుడు అని, తిరుమలగిరి చౌరస్తాలో మరో సారి నిదర్శనంగా చూపారు.

తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఆయన జగదాంబ టీ స్టాల్ వద్దకు వెళ్లారు.ఒక సామాన్యునిగా తిరుమలగిరి చౌరస్తాలో చాయ్ తాగి ముచ్చటించారు. తిరుమలగిరిలో ఈ చాయ్ ఫెమస్ అంట కదా అంటూ...! టీస్టాల్ యజమానితో మాటలు కలిపారు. నీ దగ్గర చాయ్ బాగుంటదయ్యా, ఏమేమి కలుపుతావో మాకు తెలవదని, నాయకులతో మాట మాట్లాడుతుండగానే చాయ్ రెడీ చేస్తావ్!! చాయ్ తాగుతూ.. చాయ్ కొట్టు అతనితో ఆత్మీయంగా మాట్లాడారు. ఏదీ ఓ చాయ్ పోయ్ చూద్దామన్నారు. దీంతో ఎమ్మెల్యే టీ కొట్టుకు వద్దకు రాగానే అక్కడ ఉన్నవారంతా భారీగా గుమ్మిగూడారు. సెల్ఫీలు తీసుకుంటూ, సందడి చేశారు. దీంతో ఎమ్మెల్యే అందరిని పలకరించారు. టీ స్టాల్ వద్ద చాయ్ తాగి మరో సారి సదా సీదా నాయకునిగా, వెనుతిరిగి వెళ్ళాడు. ఇది ఏమైనా మరో మారు, ప్రజల్లో ఉండే నాయకుడు అని, పిలవకుండా పలకరించే నాయకుడుగా, నిరూపించుకోవడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు.