calender_icon.png 29 August, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కొరత తీర్చాలని ధర్నా

29-08-2025 06:01:28 PM

నిర్మల్,(విజయక్రాంతి): వాన కాలంలో రైతులకు అవసరమయ్యే ఎరువుల కొరతను లేకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆ సంఘం నాయకులు విలాస్ ఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పంటలు సాగు చేసుకుంటున్నా అవసరం అన్న సమయంలో ఎరువులు లేకపోవడంతో పంటను కోల్పోయే ప్రమాదం ఉందని దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు అవసరమయ్య ఎరువులను సరఫరా చేయాలని వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముఖ్య రమేష్ కార్యకర్తలు ఉన్నారు.