calender_icon.png 29 August, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట నష్టాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు

29-08-2025 07:09:56 PM

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: కాంగ్రెస్ నేత రూపేష్ రెడ్డి

అదిలాబాద్,(విజయక్రాంతి): గడిచిన వారం పది రోజులుగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరదల వల్ల నష్టపోయిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేసేందుకు సంబంధించిన నివేదికలు త్వరగా అందించాలన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు బేల మండల పరిధిలోని సాంగిడి గ్రామంలో శుక్రవారం ఏఈఓ సతీష్, శివ, యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి పలువురు రైతులతో కలిసి నష్టపోయిన పంటలను పరిశీలించారు.

అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా చూడాలన్న ప్రభుత్వ నిర్ణయంతో చేపట్టిన ఈ సర్వేలో నష్టం పై అధికారులు నివేదికలు తయారు చేసి జిల్లా కలెక్టర్ కు అందించనున్నారు. అయితే యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి మాట్లాడుతూ సాంగిడి గ్రామంలోనే కాకుండా బేల మండలంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు.