09-10-2025 12:00:00 AM
పాలమూరు యూనివర్సిటీ, అక్టోబర్ 8: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయి పై అమానవీయమైన ఘటనను వ్యతిరేకిస్తూ పాలమూరు విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగం కుమారస్వామి మాట్లాడారు భారతదేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగంలో న్యాయవ్యవస్థ చాలా అత్యున్నతమైనదని అలాంటి న్యాయవ్యవస్థ ప్రాతినిధ్యం వహిస్తూ అత్యున్నత పదవిలొ ఉన్నటువంటి బిఆర్ గవాయి పై జరిగినటువంటి సంఘటన భారతదేశ ప్రజలు తమపై జరిగినటువంటి దాడిగా భావిస్తున్నారని తెలిపారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో అన్నీ సవివరంగా పొందుపరచడం జరిగిందన్నారు. ఒకవేళ వారికి వారిచ్చినటువంటి తీర్పుపై నమ్మకం లేనటువంటి సమయంలో దానిని వేరే బెంచ్ ద్వారా సవాలు చేయవచ్చన్నారు. అలాంటి అవకాశం మనకు భారత రాజ్యాంగంలో పొందుపరిచిందన్నారు. భారతదేశంలో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపల్ మాళవి, న్యాయ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి. భూమయ్య, ప్లేస్మెంట్ ఆఫీసర్ పాలమూరు విశ్వవిద్యాలయం డాక్టర్ ఎస్ ఎన్ అర్జున్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ డాక్టర్ ఎం కృష్ణయ్య, ప్రిన్సిపల్ ఫార్మసీ కాలేజ్ డాక్టర్ సిహెచ్ రవికాంత్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ కిషోర్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ ఎం జ్ఞానేశ్వర్, డాక్టర్ ఎస్ రవికుమార్, డాక్టర్ బి పర్వతాలు, డాక్టర్ వి. విజయభాస్కర్, డాక్టర్ పి శిలాస్, డాక్టర్ గురుస్వామి డాక్టర్ ఎం మధు, డాక్టర్ ఈశ్వర్ కుమార్, కే మాధురి మోహన్ డాక్టర్ బి రవీందర్ గౌడ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.