calender_icon.png 9 October, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం

09-10-2025 12:00:00 AM

మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, అక్టోబర్8 (విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బజార్ హత్నూర్ మండలంలోని కాం డ్లి గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాదవ్ సుభాష్ నాయక్, జాదవ్ వైష్ణవి నేతృత్వంలో సుమారు 100 మంది బోథ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  సమక్షంలో కాంగ్రెసు నుండి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 

 వారిలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన జాదవ్ సుభాష్ నాయక్ మాట్లాడుతూ ప్రతీ గ్రామం అభివృద్ధి చెందాలంటే కేవలం అది బీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని పార్టీలో చేరమని అన్నారు. అనంతరం  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ప్రతీ సీటు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఏ పల్లెకు వెళ్లిన సారె కావాలి, మళ్ళీ కారే రావాలి అంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.