calender_icon.png 15 July, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిహారం రాలేదని హోర్డింగ్ ఎక్కి ఆందోళన

15-07-2025 12:40:48 AM

- నిరసన వ్యక్తంచేసిన మూలవాగు బ్రిడ్జి భూబాధితులు

రాజన్న సిరిసిల్ల, జూలై 14 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మూలవాగుపై నిర్మించనున్న రెండో బ్రిడ్జి భూసేకరణలో భాగంగా తమకు నష్టపరిహారం రాలేదని బాధితులు సోమవారం ఆందోళనకు దిగారు. వేములవాడ పట్టణంలోని భారీ హోర్డింగుల పైకి ఎక్కి నిరసన తెలిపారు. తమ భూమికి సంబంధించిన నష్ట పరిహారం రాలేదని నిరసన తెలుపుతున్న ఓ మహిళను పోలీసులు లాక్కెళ్లడం వివాదాస్పదంగా మారింది.

‘ఏం చేసుకుంటారో చేసుకోండి.. చంపుతారా? చంపండి’ అంటూ ఆమె రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తంచేసింది. తిప్పాపూర్ మూలవాగుపై నిర్మాణంలో ఉన్న రెండో వంతెన కోసం భూసేకరణలో భాగంగా అధికారులు. ఇళ్ల కుల్చివేత ఆదివారం రాత్రి నుంచి ప్రారంభించారు. అయితే, తమకు పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చుతున్నారని ఆరోపిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. పోలీసుల బందోబస్తు మధ్య బాధితులను పక్కకు లాగేసి అధికారులు పనులు కొనసాగించడం గమనార్హం.