15-07-2025 12:39:48 AM
బూర్గంపాడు,జూలై 14, (విజయక్రాంతి):భద్రాచలం పబ్లిక్ స్కూల్ నందు పెంచిన స్కూల్ ఫీజులను తగ్గించాలని కోరు తూ సోమవారం ఐఎన్ టియుసి మిత్రపక్షాల ఆధ్వర్యంలో సారపాక ఐటిసి పిఎస్పిడి వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు.అనంతరం పలు సమస్యలపై యాజమాన్యానికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ మిత్రపక్షాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గోనే రామారావు,యారం పిచ్చి రెడ్డి,కార్మికులు పాల్గొన్నారు.