calender_icon.png 18 September, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాల వైపు అడుగెయ్యాలి

18-09-2025 08:38:11 PM

ధర్మపురి (విజయక్రాంతి): పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంతాకుమారి హాజరై ప్రసంగించారు. విద్యార్థినిలు కచ్చితంగా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం కృషి చేయాలని, ఓటమి చెందిన దిగులు పడకుండా లక్ష్యాన్ని చేరేవరకు పోరాడాలని సూచించారు. మహిళలు సోషల్ మీడియా పట్ల చాలా జాగ్రత్త వహించాలని, సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలని తల్లిదండ్రులను గురువులను గౌరవించాలని, జీవితంలో ఎదురయ్య ఎన్నో సమస్యలను ధైర్యంతో ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధాన అధ్యాపకురాలు లక్ష్మి, లీడ్ ఇండియా శిక్షణ సమన్వయకర్త, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపునులు తాడూరి శ్రీనివాస్ ఆచార్య, అధ్యాపకులు మంగ, సువర్ణ, కవిత, సహుజ, విద్యార్థులు పాల్గొన్నారు.