18-09-2025 08:32:52 PM
అందజేసిన మాజీ మంత్రి మల్లా రెడ్డి, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
మేడిపల్లి (విజయక్రాంతి): పీర్జాదిగూడ నగర ప్రజలకు దసరాలోపు మంచినీళ్ళు అందించి, ప్రజల సమస్యలు పరిష్కరించాలని పీర్జాదిగూడ కమిషనర్ త్రిళేశ్వర్ రావు(Commissioner Thrilleshwar Rao)కు మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లా రెడ్డి, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు, నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీర్జాదిగూడ నగరంలోని పలు కాలనీలలో ప్రజలు ఏదురుకుంటున్న తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, సమస్యలను పరిష్కరించాలని, దసరా పండుగ లోగ ప్రజలకు మంచినీళ్లు అందించాలని అవసరమైన చోట నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయాలని, సిసి రోడ్డు, డ్రైనేజి వంటి మౌలిక సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన పనులు ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు.
కమీషనర్ సానుకూలంగా స్పందంచారని అన్ని పనులకు టెండర్ వేశారని, సమస్యలు అన్ని ముందే అంచనా వేశామని, దసరాలోపు అన్ని పనులు పూర్తిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొంతురి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, జావీద్ ఖాన్,జిలాని పాషా, సోమేశ్ గౌడ్, వివిధ కాలనీల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.