18-09-2025 09:02:33 PM
మెట్ పల్లి (విజయక్రాంతి): పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం వైద్యాధికారుల ఆధ్వర్యంలో టీబీ ఛాంపియన్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా మండల వైద్యాధికారి డాక్టర్ అంజిత్ రెడ్డి మాట్లాడుతూ శిక్షణను అన్ని గ్రామాలలో టీబీతో బాధపడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు, టీబీ వ్యాధి యొక్క లక్షణాలు, తీసుకోవలసిన పౌష్టిక ఆహారం గురించి తెలిపారు. టీబీ నిర్ధారణ కోసం చేసుకోవాల్సిన టెస్టులు, వాడవలసిన మందుల గురించి వివరించారు. టీబీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిబి లీడ్ రవి, టిబి ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఆంజనేయులు, సి హెచ్ ఓ సుల్తానా, సూపర్వైజర్ అచ్యుత్ రావు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.