10-07-2025 12:00:00 AM
దశాబ్దాల తరబడి సింగరేణిలో పనిచేసి, సంస్థ లాభాలు గడించేందుకు సర్వశక్తులు ధార పోసిన రిటైర్డ్ ఉద్యోగుల పట్ల సిం గరేణి యాజమాన్యం కనికరం చూపడం లేదు. ఫలితంగా విశ్రాంత సింగరేణీయులకు సరైన వైద్య సౌకర్యాలు అందక అచేతన స్థితిలో బతకాల్సి వస్తున్నది. ప్రస్తుతం కోల్ ఇండియా ఆదేశాల ప్రకారం సంస్థలో రూ.8 లక్షల బీమా అమలవుతున్నది. నేటి వైద్యఖర్చుల కు ఆ బీమా సరిపోవడం లేదు.
సింగరేణి సంస్థ రాష్ట్రప్రభుత్వం ఆధీనంలోనే నడుస్తున్నది. సర్కార్ వెంటనే స్పందించి కోల్ ఇండియాతో సంబంధం లేకుండా కార్మికుల కోసం మెరుగైన బీమా అమలు చేయాలి. గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి, కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలి.
దండంరాజు రాంచందర్‌రావు, హైదరాబాద్