calender_icon.png 15 July, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈత మొక్కలు నాటేందుకు భూమివ్వండి

14-07-2025 10:43:00 PM

తోల్కట్ట గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతి..

చేవెళ్ల: మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటేందుకు భూమి కేటాయించాలని సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి భానూరి శివ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రజావాణిలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో సర్వే నెంబర్ 137/అ3  లో 2 ఎకరాలు, 137/ఊ లో 2.34 ఎకరాలు, 124లో 1.33 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని వివరించారు. ఈ సర్వే నెంబర్ల గుండా వాగు ఉంటుందని, దీనికి ఇరువైపులా తోల్కట్ట గౌడ సంఘం (రిజిస్టర్ నెం. 827/2022) ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటేందుకు భూమిని కేటాయించాలని కోరారు. దీన్ని వల్ల కల్లు ఉత్పత్తికి తమకు అవకాశం, ఆదాయం లభించడమే కాకుండా.. వాగు కోతకు గురికాకుండా ఉంటుందని చెప్పారు.