14-07-2025 10:40:55 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ముంపునకు గురవుతున్న భూముల రైతులతో సమావేశమై రైతులకు న్యాయం చేస్తానని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) హామీ ఇచ్చారు. కాళేశ్వరం దిగువన బీరసాగర్ వద్ద ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఐదు మండలాలు మహదేవపూర్, పలిమెల, కాటారం, మహముత్తారం, మలహర్రావు, మండలాలలోని చెరువులకు పైపులైన్ల ద్వారా చెరువులలో నీటిని నింపి రైతులు రెండు పంటలు పండించుటకు ఈ ప్రాజెక్టు దోహదం పడటకు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.
అనంతర జరిగిన పరిణామాల వల్ల చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు తెర మరగయింది. మళ్లీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మంతిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు రాష్ట్ర మంత్రి అండతో మా రైతులకు ఏదైనా ఉపకారం చేయాలని ఉద్దేశంతో మళ్లీ చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఎర్ర చెరువు రిజర్వాయర్ నుంచి ఊర చెరువు మీదుగా బ్రాహ్మణ పెళ్లి, తదితర గ్రామాల చెరువులకు లింకేజీ కలిపే కాలువల నిర్మాణం కొరకు సర్వే జరుగుతుండగా ఈ సర్వేలో డి 1 డి 2 డి3 అనే మూడు కాలువలు నిర్మించి చెరువులను నింపి రైతులకు నీళ్లు అందుబాటులో తీసుకురావడానికి సర్వే చేస్తుండగా ఇక్కడి రైతులు మా భూములు విలువైనవి ఇందులో వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి పండించడం జరుగుతుందని వీటికి నీటి అవసరం చాలా తక్కువగా ఉంటుందని ఈ కాలువలో తీయడం వల్ల తమ భూములు నష్టపోవడం జరుగుతుందని ఇటీవల మంతిని కి వచ్చిన మంత్రి శ్రీధర్ బాబుకు రైతులందరూ విజ్ఞప్తి చేయడం జరిగింది.
దీనిని దృష్టిలో ఉంచుకున్న మంత్రి శ్రీధర్ బాబు రైతుల వద్దకే వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. ఈరోజు మహదేవపూర్ మండల కేంద్రంలోని పోత వెంకటస్వామి ఇంటి వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతుల తమకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మంత్రికి తెలపడంతో వెంటనే స్పందించిన మంత్రి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఆధ్వర్యంలో ఈ కాలువల నిర్మాణం ద్వారా ఏ రైతులయితే భూములు కోల్పోతున్నారో వారి యొక్క జాబితా తీసుకొని వారి అభిప్రాయాలను నాకు అందజేయాలని ఆదేశించారు. ఈ పరిమాణంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.