calender_icon.png 11 October, 2025 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైమెంట్ బకాయిలు ఎప్పుడు ఇస్తారు?

10-10-2025 12:56:46 AM

- మరణిస్తున్న చలనం లేదా...? సర్కారు స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం

సిద్దిపేట ,అక్టోబర్ 9 (విజయక్రాంతి): 18 నెలలైనా రిటర్మెంట్ బకాయిలు రాకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రేవా (రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్) ఆందోళన వ్యక్తం చేసింది. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన సిద్దిపేట జిల్లా రేవా సమావేశానికి పోనమల్ల రాములు అధ్యక్షత వహించారు.

గత సంవత్సరం మార్చిలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు జిపిఎఫ్ , జిఐఎస్, ఇఎల్‌ఎస్ , కమిటేషన్ , గ్రాట్యూటీ మొదలగు బకాయిలు భారీగా పెండింగ్ ఉన్నాయని తెలిపారు. బకాయిలు రాక కొందరు రిటైర్డ్ ఉద్యోగులు గుండె పగిలి మరణించారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు స్పందించకపోవడం శోచనీయమన్నారు.

ఈ విషయంలో ప్రభుత్వం చట్టబద్ధంగా స్పందించి బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం డి ఏ ఇవ్వడం లేదని, పిఆర్సి అమలు చేయడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా రేవా కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్ గా పోనమల రాములు, సెక్రటరీగా ఎండి సలీం , కోశాధికారిగా రాజిరెడ్డి , పి ఆర్ ఓ విష్ణు, సలహాదారులుగా జయ సింహారెడ్డి , పిడి శ్రీనివాస్లు ఎన్నికయ్యారు.