23-09-2025 01:14:01 AM
కామారెడ్డి సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా ఇటీవలి భారీ వర్షాలతో నష్ట పోయిన వరద బాధితులకు పీఆర్టీయూ తెలంగాణ సంఘం నాయకులు అండగా నిలిచారు. జిల్లా శాఖ పిలుపు మేరకు కలెక్టర్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కోసం రూ.7,06,011 విరాళం సేకరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను కలిసి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
సహాయ నిధికి నిధులు అందించిన పీఆర్టీయూ తెలంగాణ జిల్లా బాధ్యులను అభినందించారు. ఆపద సమయంలో ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలను మరిన్ని నిర్వహించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కుశాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సహాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, సంగారెడ్డి, గోవర్దన్, వివిధ మండల శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మండ్లు, రమణ, రామచంద్ర రెడ్డి, ప్రసాద్, సంతోష్, రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.