calender_icon.png 4 September, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

01-09-2025 05:55:23 PM

జేఏసీ చైర్మన్ టీఎన్జీవో  జిల్లా అధ్యక్షులు నాగిల్ల మురళి 

ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన 

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): పిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాగిల్ల మురళి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్,కార్మికులు ఐక్యంగా నల్ల దుస్తులు ధరించి కలెక్టర్ కార్యాలయం ముందు  నిర్వహించిన   ధర్నాలో పాల్గొని మాట్లాడారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని పేర్కొన్నారు.

ఉద్యోగులు ఉద్యోగ జీవిత జీవితాంతరం భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ వాటాను గత ప్రభుత్వం నుండి జమ చేయకపోవడం దారుణం అన్నారు. ఉద్యోగులు సిపిఎస్ ద్వారా నష్టపోతున్నారని, ఉద్యోగులు పెండింగ్ బిల్లులను అందజేయాలని అన్నారు.  హెల్త్ కార్డులను అమలు చేసి G.O.Ms No.317 బాధితులను న్యాయం చేయాలని తెలిపారు. అనంతరం హైదరాబాదులో జరిగే  రాష్ట్ర స్థాయి సిపిఎస్ వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన మీటింగ్ కు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.