27-07-2025 04:22:48 PM
రాచకొండ ప్రభాకర్
నాగార్జునసాగర్,(విజయక్రాంతి): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని మత్తు పదార్థాల వాడకాన్ని యువత వ్యతిరేకిం చాలని నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ అంతర్జాతీయ పర్యాటక ప్రదేశంలో మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా మత్తు బారిన బడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్న యువతకు సందేశాలతో కనువిప్పు కలిగిస్తూ మత్తు రహిత సమాజ స్థాపన కోసం తన వంతు కృషి చేస్తున్న సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాచకొండ ప్రభాకర్ జాతరలు ఉత్సవాలు వారాంత సంతలలో రద్దీగా ఉన్న ప్రాంతాలలో సెలవు రోజులలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మధ్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం నో డ్రగ్స్ సేవ్ లైఫ్ అంటూ కరపత్రాలు పంచుతూ చేతిలో మైకు పట్టుకుని ఫ్లెక్సీతో విచిత్ర వేషధారణతో ప్రచార నిర్వహిస్తున్నారు.