calender_icon.png 6 October, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి రద్దు

06-10-2025 12:00:00 AM

* హెల్ప్ డెస్క్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ

* జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

మెదక్, అక్టోబర్ 5 (విజయక్రాం తి):స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సి బ్బంది నిమగ్నమై ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు జిల్లా అధికారులు అందుబాటులో ఉండరని, మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కా ర్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఒక ప్ర కటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని, కేవలం హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే ప్రజావాణి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రజలు సహకరించాలని కోరారు.