calender_icon.png 22 July, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

26-05-2025 08:11:55 PM

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రజల నుంచి ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(Mahabubabad District Collector Adwait Kumar Singh) ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలను ప్రజల నుంచి విజ్ఞప్తిలో స్వీకరించారు. అధికారులు తమ పరిధిలో తీర్చలేక సమస్యలకు పరిష్కారం చూపాలని, లేని పక్షంలో సంబంధిత విభాగాల అధికారులతో సమన్వయ పరుస్తూ దరఖాసుదారులకు దిశా నిర్దేశం చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ఈ సందర్భంగా 122 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించి వచ్చాయి. అనంతరం జిల్లా స్థాయి అధికారులతో ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పిడి మధుసూదన్ రాజ్, డిసిఓ వెంకటేశ్వర్లు, సిపిఓ సుబ్బారావు, డిఏఓ విజయ నిర్మల, డిపిఓ హరిప్రసాద్, మైనారిటీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్ డిహెచ్ఓ మరియన్న, గ్రౌండ్ వాటర్ డిడి సురేష్, వివిధ శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.