26-05-2025 08:14:50 PM
ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): ఇల్లందు మండలం మాణిక్యారం మీదుగా బొయితండా వరకు ఆర్టీసీ బస్సును నడిపించాలని కోరుతూ సోమవారం ఇల్లందు డిపో మేనేజర్ కు ఆయా గ్రామాల మహిళలు వినతి పత్రం అందజేశారు. స్వయం సహక సంఘాల మహిళలు ఇల్లందుకు వచ్చి పోవాలంటే ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. మహిళల విన్నపాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.