calender_icon.png 23 July, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో యూరియా కొరత లేదు

23-07-2025 12:43:15 AM

- కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు

- డీఏవో చత్రు నాయక్

మంచిర్యాల, జూలై 22 (విజయక్రాంతి): జిల్లాలో యూరియా కొరత లేదని, ఈ సీజన్‌కు కావలసిన ఎరువులను దఫ దఫాలుగా ముందే జిల్లాకు తీసుకువస్తున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్ అన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల రైతు వేధికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

సరిపడా యూరియా జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా పంపిణీ జరుగుతుందని, రైతు ఆధార్ కార్డుతో ఈపాస్ మెషీన్ ద్వారా యూరియా కొనుగోలు చేయాలన్నారు. పొలం గట్లవెంట కంది పంటను, కూరగాయలు వేస్తే రైతు కుటుంబానికి అదనపు ఆదాయం సమకూరుతుందనీ, సంప్రదాయ పంటలైన వరి, పత్తి పంటలు కాకుండా పప్పు దినుసులు వేయాలన్నారు. 

ప్రస్తుతం సబ్సిడీ ఉన్న ఆయిల్ పామ్ పంటలు వేసేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవాలనీ జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ కోరారు. ఎక్కడైతే భూమి ఉన్నదో సమీప రైతు వేధికలో నమో దు చేసుకోవాలని, తద్వారా కేంద్ర ప్రభు త్వం పథకాల వల్ల వచ్చే లబ్దిని రైతులు పొం దగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ శాఖ ఏడిఏ అనిత, హాజీపూర్ ఏ ఓ క్రిష్ణ, ఆత్మ డైరెక్టర్ కుమార్ యాదవ్, ఫెర్టిలైజర్ డీలర్స్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు ఇతర డీలర్స్, ముల్కల్ల గ్రామ అభ్యుదయ రైతులు తదితరులు  పాల్గొన్నారు.