30-09-2025 02:11:01 AM
తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి
ముషీరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో గ్రూప్-1, 2 పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాలు సాధించిన తెలంగాణ మట్టి బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరుల ఆశయ సాధనకు చిత్తశుద్ధితో ప్రజాసేవ చేయాలని తెలం గాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి ఆకాంక్షించారు.
ఈ మేరకు సోమ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో కుటుంబ, ఆర్థిక, కష్టనష్టాలను అధిగమించి మిశ్రమ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొ ని విజేతలుగా నిలిచి, మీ కుటుంబాల్లో ఓ వెలుగు వెలిగించిన తెలంగాణ బిడ్డలను అభినందించారు.
యువతకు విశ్వాసాన్ని నింపేందుకు మీపైన ఉంచబడే గురుతర బాధ్యతలను ఆదర్శవంతంగా నెరవేర్చాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నూతనంగా ఉద్యోగాలు చేపట్టబోయే యువ తెలంగాణ మట్టి బిడ్డలకు తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల పక్షాన సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.