17-08-2024 12:00:00 AM
భద్రాచలం, ఆగస్టు 16(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్రస్వామి వారిని శుక్రవారం హైకోర్టు జడ్జీలు కే శరత్, ఎం లక్ష్మణ్ దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆశీర్వచనం, పట్టు వస్త్రాలు, ప్రసాదం అందజేశారు.