calender_icon.png 21 November, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్యాలను వంద శాతం సాధించాలి

17-08-2024 12:00:00 AM

బ్యాంకర్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన

వనపర్తి, ఆగస్టు 16 (విజయక్రాంతి): ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం బ్యాంకర్లకు ఇచ్చిన లక్ష్యాలను వంద శాతం సాధించాలని రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. శుక్రవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జిల్లాస్థాయి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి హాజరై మాట్లాడారు.

జిల్లా అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వాములు కావాలని, వ్యవసాయ రుణాలతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రుణ సదుపా యం ఉన్న రంగాలపై అవగాహన కల్పించాలన్నారు. రుణమాఫీ అయిన రైతులను ఇబ్బంది పెట్టకుండా మళ్లీ రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎల్డీవో రిజర్వ్ బ్యాంక్ రెహమాన్, నాబార్డు ఏజీఎం మనోహర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.