calender_icon.png 28 October, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాడ్మింటన్‌కు పీవీ సింధు బ్రేక్

28-10-2025 01:04:18 AM

హైదరాబాద్, అక్టోబర్ 27: భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని నెలల పాటు ఆట నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించింది. గాయం కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా సింధు సుధీర్ఘ పోస్టు పెట్టింది. పాదం గాయం కారణంగా ఈ ఏడాదిలో మిగిలిన అన్ని బీడబ్ల్యూఎఫ్ టోర్నీల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపింది. తన టీమ్‌తో పూర్తి గా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. యూరోపియన్ టోర్నీకి ముందు పాదానికి గాయమైందని, దాని నుంచి పూర్తి గా కోలుకోలేదని తెలిపింది.అభిమానుల మద్ధతుతో త్వరలోనే బలంగా తిరుగొస్తానంటూ పోస్టులో రాసుకొచ్చింది.