calender_icon.png 28 October, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పృథ్వీ షా డబుల్ సెంచరీ

28-10-2025 01:07:50 AM

-రాజస్తాన్‌పై జమ్మూకాశ్మీర్ విజయం

-రంజీ ట్రోఫీ రౌండప్

ఛత్తీస్‌ఘడ్, అక్టోబర్ 27: జాతీయ జట్టు కు దూరమైన యువ బ్యాటర్ పృథ్వీ షా దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్నాడు. తన కెరీర్‌ను మళ్ళీ గాడిన పెట్టుకునే క్రమంలో నిలకడగా రాణిస్తున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీతో చెలరేగాడు.  కేవలం 142 బంతుల్లోనే ద్విశతకం బాదా డు. రంజీ చరిత్రలో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ. అలాగే 72 బంతుల్లోనే శతకం చేయడం ద్వారా రంజీల్లో ఆరో వేగవంతమైన సెంచరీ రికార్డ్ నెలకొల్పాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన పృథ్వీ షా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సత్తా చాటాడు. మొత్తం 156 బంతుల్లో 29 ఫోర్లు, 5 సిక్సర్లతో 222 పరుగులు చేసి నాటౌట్‌గా నిలి చాడు. మరో మ్యాచ్‌లో రాజస్తాన్‌పై జమ్మూ కాశ్మీర్ ఇన్నింగ్స్ 41 రన్స్‌తో విజయం సాధించింది.