25-07-2024 12:05:00 AM
సంగారెడ్డి, జూలై 24 (విజయక్రాంతి): శాంతి భత్రలు కాపాడే పోలీసు అధికారులు సివిల్ కేసుల్లో జోక్యం చేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పలు స్టేషన్లలో వచ్చిన ఫిర్యాదులను విచారణ చేయాల్సిన పోలీసులు.. ఫిర్యాదుదారులనే బెది రింపులకు గురిచేస్తున్నారు. సివి ల్ కేసుల్లో బాధితులకు న్యాయం చేయకుండా సీఐలు, ఎస్‌ఐలు నిర్ల క్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంగారెడ్డి సీసీఎస్‌లో సీఐగా పనిచేసి, సస్పెన్షకు గురైన సీఐ మట్టపర్తి సాయి వెంకటకిషోర్ రూ.5 లక్షలు తీసుకుంటు ఏసీబీకి చిక్కిన ఘటనతో పలు విషయలు వెలుగులోకి వస్తున్నాయి.
సంగారెడ్డి సబ్ డివిజన్ లో కొందరు సీఐలు రియల్ వ్యాపారులతో కలసి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులను బెదిరింపులకు గురిచేసిన ఘటనలు ఉన్నాయి. జహీరాబాద్ సబ్ డివిజన్‌లో రాష్ట్ర సరిహద్దులో ఉన్న పోలీ సు స్టేషన్ల ఎస్‌ఐలు మాట్కా, గుట్కా నిర్వాహకుల నుంచి ముడుపులు తీసుకుంటున్నారని ఎస్బీ, ఇంటిలిజెన్స్ అధికారులకు కొంద రు రిపోర్టు పంపినా చర్యలు తీసుకోలేదనే సమాచారం.
రియల్ వ్యాపారులు, కబ్జాదారులతో దోస్తీ
సంగారెడ్డి జిల్లాలో కొందరు సీఐలు, ఎస్‌ఐలు భూ కబ్జాదారులు, రౌడీషీటర్లతో పా టు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో స్నేహం చేస్తున్నారు. రియల్ వ్యాపారులు ఇచ్చే డబ్బులు తీసుకోవడంతోపాటు ప్లాట్ల అమ్మకంలో వాటా తీసుకుని అండగా నిలుస్తున్న ట్లు సమాచారం. అక్రమార్కులతో దోస్తీ చేస్తున్న అధికారులు ఓపెన్ ప్లాట్, అపార్ట్‌మెంట్‌లో ప్లాట్లు తీసుకుంటున్నట్లు తెలు స్తు న్నది. సంగారెడ్డి జిల్లాలో అమీన్‌పూర్, పటాన్‌చెరు, జిన్నారం. గుమ్మడుదల, హత్నూర, సదాశివపేట, కొండాపూర్, మునిపల్లి, జోగిపేట, భానూర్, ఐడీఏ బొల్లారం, జహీరాబాద్ టౌన్, చిరాగ్‌పల్లి, కోహీర్, హద్నూ ర్, నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్, నాగల్‌గిద్ద పోలీసు స్టేషన్ల పరిధిలో జోరుగా రియల్ వ్యాపారం సాగుతుంది.
దీంతో పోలీసు అధికారులు రియల్ వ్యాపారులతో దోస్తీ చేసి అక్రమలకు పాల్ప డుతున్నారు. కొందరు అధికారులు నేరుగా రియల్ వ్యాపారులతో కలసి వ్యాపారం చేస్తున్నారు. వివాదంలో ఉన్న భూముల కొనుగోలుకు పోలీసు అధికారులు ఆసక్తి చూపుతున్నారు. వివాదంలో ఉన్న భూ సమస్య పరిష్కారం కోసం ఎవరైనా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగానే వెంటనే పోలీసు అధికారులు తమకు చెందిన రియల్ వ్యాపారులకు సమాచారం ఇచ్చి ఆ భూమి కొనుగోలుకు ప్రయత్నం చేస్తున్నారు. తక్కువ ధరకు భూమిని కొని, ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తున్నారు.
నిద్రపోతున్న ఎస్బీ నిఘా అధికారులు
సంగారెడ్డి జిల్లాలో పోలీసు అధికారుల అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఎస్బీ అధికారులు మొద్దు నిద్రపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రియల్ వ్యాపారులతో కలసి దందా చేస్తున్న కొందరు సీఐలు, ఎస్‌ఐల బాగోతం తెలిసినా పట్టిం చుకోవడం లేదు. కొందరు ఎస్బీ అధికారులు పోలీసుల దందా గురించి రిపోర్టు చేసినా సరైన సాక్ష్యాధారాలు లేక ఉన్నతాధికారులు బుట్ట దాఖలు చేస్తున్నట్లు సమాచారం. పటాన్‌చెరు పోలీసు సబ్ డివిజన్‌లో కొందరు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు.