calender_icon.png 26 January, 2026 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వాన్ని చాటుకున్న సర్పంచ్

26-01-2026 01:11:29 AM

తరిగొప్పుల, జనవరి 25 (విజయక్రాంతి): మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామానికి చెందిన కాసర్ల రాణి అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న సర్పంచ్ కావటి సుధాకర్ అంత్యక్రియలకు ఎని మిది వేల రూపాయలు మరియు ఉప సర్పంచ్ నీల సంపత్ 2000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం అంత్యక్రియలో పాల్గొని పాడమోసి మానవత్వం చాటుకున్నారు.

ఆ నిరుపేద కుటుంబానికి గ్రామ ప్రజలు తోచిన సహాయం పలువురు అందజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ భాషబోయిన రాజు, బాల కుమారు,భాషబోయిన రమేష్, సురేష్, చింతల్ ఎల్లయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.