06-11-2025 01:44:32 AM
నిబంధనలు సడలించాలి
రైతులు ఆరుగాలం కష్టపడి పండిం చిన వివిధ పంటలకు ప్రభుత్వ మద్దతు ధర కల్పించేందుకు పంటలపై ఉన్న తేమ నిబంధనలను వెంటనే ఎత్తివే యాలి. ఈసారి అధిక వర్షాలు ఆపై వరదలు పంట తెగుళ్లు ఎక్కువగా వచ్చి రైతులు నష్టం పోతున్నారని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.
ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి
-అసలే దిగుబడులు తక్కువ.. ఆపై ఆంక్షలతో రైతన్న ఆగ్రహం
-రైతుల కష్టానికి దక్కని ప్రతిఫలం
-నిబంధనలు సడలిస్తేనే.. అన్నదాతలకు మేలు
నిర్మల్, నవంబర్ 5 (విజయక్రాంతి): పదిమందికి అన్నం పెట్టే రైతు బతుకు అన్నమో.. రామచంద్రగా మారింది. ఆరు గాలం కష్టపడి పంటలు పండిస్తే ఆ పంటను అమ్ముకోవడానికి ప్రభుత్వం నిర్బంధపు నిబంధనలు అమలు చేయడంపై జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పంట లు ఏవైనా ప్రభుత్వ నిబంధనలు పంట విక్రయాలకు తీవ్ర ఆటంకాన్ని కలిగించడంతో పంటను పండించిన రైతులు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
దేశానికి వెన్నెముక రైతు అని గొప్పలు చెప్పుకుం టున్న ప్రభుత్వాలు రైతు శ్రేయస్సు కోసం పాటుపడాల్సిండగా నిబంధనలు కఠినంగా అమలవుతున్న ప్రభుత్వం వాటిని సడలింపు అంశంపై అధికారులు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిర్మల్ జిల్లాలో వానాకాలం సీజన్లో 4.68 లక్షల ఎకరాల వివిధ పంటలు రైతులు సాగు చేశారు. ఇందులో ప్రధానంగా పత్తి 1.68, వరి 1:30. సోయా 80, మొక్కజొన్న 30 వేల ఎకరాలు సాగు చేయగా మిగతా పంటలు ఉన్నాయి.
జిల్లాలో వాన కాలంలో పంటలు సాగు చేసిన రైతులకు ఈసారి అధిక వర్షాలు ఆపై వరదలు పంటపై తెగుళ్లు ఆశించడంతో పంట దిగుబడులు తగ్గాయి. పండిన పంటను మద్దతు ధరకు విక్రయించుకుందామనుకుంటే ప్రభుత్వం నిబంధనలు మద్దతు ధర దక్కకుండా రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. అసలే ఆలస్యంగా కొనుగోలను ప్రారంభించడం ప్రభుత్వం పంట కొనుగోలులో నిబంధనలు ఆన్లైన్ నమోదు అంశాలు రైతులకు తీవ్ర కష్టాలను తెచ్చిపెడుతున్నాయి.
నిబంధనలు కఠినం.. రైతులకు కష్టం
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు అయ్యేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జిల్లాలో ఇప్పటికి ప్రభుత్వపరంగా మొక్కజొన్న సోయా పత్తి కొనుగోలను ప్రభుత్వం ప్రారంభించింది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో సోయా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా సోయకు 5283. మొక్కజొన్నకు 2400, పత్తికి 80 10 మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు చేస్తున్నారు.
వరి ధాన్యం కూడా 22 83 మద్దతు ధర ప్రకటించగా సన్నాలకు 500 అదనపు బోనసులు చెల్లించనున్నారు. ఇంతవరకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు బాగానే ఉన్నా విషయంలో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వర్షాలు కురవడం వాతావరణం మేఘావృతమై ఉండడం పంటలకు తేమశాతం పెరిగిందని అంటున్నారు. పత్తికి 12 శాతం మొక్కజొన్నకు 17% ఇతర పంటలకు 17తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని కండిషన్ విధించింది.
దీనికి తోడు పత్తి ఎకరానికి ఏడు క్వింటాళ్లు మొక్కజొన్నలు సోయలు పత్తి పరిమిత సంఖ్యలో కొనుగోలు చేయాలని నిబంధన విధించడంపై రైతులు మండిపడుతున్నారు. పంటల తేమశాతం విషయంలో తడలింపు చేసి మద్దతు ధర చెల్లించే విధంగా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని జిల్లా రైతంగం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది. పంట పరిమిత కొనుగోలపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతులు చేస్తున్న డిమాండ్ మార్కెట్ సంస్థలు సిసిఐ డీసీఎంఎస్ గిరిజన కోపరేటివ్ సొసైటీ ఐకెపి సొసైటీల ద్వారా తేమశాతం ప్రభుత్వం ప్రకారం ఉంటేనే కొనుగోలు చేస్తామని మొండికి వేయడంతో ప్రభుత్వం సంస్థల మధ్య పంచాయతీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తేమ విషయంలో కొంత సడలింపు ఇవ్వాలని కోరుతున్న సంస్థలు అందకు నిరాకరణ చేయడంతో రైతులకు తీవ్ర నష్టం జరగనుంది.
వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే దిగుబడులు లేక వర్షాలు పడి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలకు చెప్పిన వారు నిబంధనలు విషయంలో తమ చేతిలో లేదని తేల్చి చెప్పడం రైతులకు మరింత కష్టాలను తెచ్చిపెడుతోంది. దీంతో రైతులు ప్రభుత్వం అమలు చేస్తున్న తేమ శాతం పంటలు తీసుకోవడానికి రోజుల తరబడి పంట పొలాలు రోడ్లపై ఖాళీ ప్రదేశాల్లో దాన్యం పోసుకొని ప్రతిరోజు ఆరబెడుతూ పడరాన్ని కష్టాలు పడుతున్నారు. పంటలు పండించిన రైతుకు నిబంధనలను సడలించాలని జిల్లా రైతాంగం కోరుతున్న అవి ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలు లేవు.