calender_icon.png 6 November, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఎంపీ ఇంటి ముట్టడిలో ఉద్రిక్తత

06-11-2025 01:43:34 AM

  1. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన బీఆర్‌ఎస్ శ్రేణులు

ఆదిలాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లలో ఎకరానికి 10క క్వింటాళ్లకు బదులుగా 7 క్వింటాళ్లు కొనుగోలు నిబంధన నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ ఎంపీ గోడం నగేష్ ఇంటి ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న నేతృత్వంలో బుధవారం పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఎంపీ నగేష్ ఇంటి ముట్టడికి తరలివచ్చారు.

విషయం తెలుసుకున్న పోలీసులు డిఎస్పి జీవన్ రెడ్డి నేతృత్వంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పా టు చేసి, ఎంపీ ఇంటికి మూడు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసారు. కానీ మాజీ మంత్రి తో పాటు బీఆర్‌ఎస్ శ్రేణులు బారికేడ్లను తోసుకుంటూ వచ్చి ఎంపీ ఇంటి ముందు బైఠా యించి, నిరసన నినాదాలతో హోరెత్తించారు. కొందరు బీఆర్‌ఎస్  నాయకులు ఎంపీ ఇంట్లో కి చొరబడేందుకు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకోన్నారు.

దీంతో పోలీసులు బీఆ ర్‌ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకు నీ, తోపులాటలో పలువురు కార్యకర్తలకు గాయాలుకావడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు పోలీసులు రామన్నను బల వంతంగా ఈడ్చుకుంటూ వాహనంలో ఎక్కించాగా,  బీఆర్‌ఎస్ నాయకులు పోలీస్ వాహ నాన్ని అడ్డుకున్నారు. దీంతో మరింత ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు తమ నాయకున్ని బలవంతంగా అరెస్టు చేసి, రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించడంతో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. 

మరోవైపు మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో పాటు పలువురు నేతలు తిరిగి ఎంపీ ఇంటి ముందు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ... తేమ నిబంధనలు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలనీ ఎన్నోమార్లు వినతులు ఇచ్చినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని అన్నారు. తాజాగా ఎకరానికి కేవలం 7  క్వింటాళ్ళు మాత్రమే పత్తి కొనుగోలు చేస్తుందన్న నిబంధనతో రైతులను కేంద్రం నట్టేట ముంచుతోందని మండిపడ్డారు.   

అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పం డించిన పంట కొనుగోళ్లకు కేంద్రం కొత్త నిబంధనలను తెస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. పత్తి కొనుగోళ్ళు ప్రారంభమైన తొలిరోజు ఆరు వందల పత్తి వాహ నాలు వస్తే అందులో అయిదింటికి మాత్రమే పన్నెండు శాతం తేమ వచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సీసీఐ సంస్థ నిబంధనలు సడలించాల్సింది పోయి.. స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు వాటిని సమర్ధించడం అన్యాయమని మండిపడ్డారు.

వారి రాజకీయాల కోసం  రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న ఎంపీ, ఎమ్మెల్యే పట్టించుకోకుండా ఉండడం వారి అసమర్ధతకు నిదర్శ నం అన్నారు. రైతుల నడ్డి విరిచేలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టేం దుకే ఎంపీ ఇంటి ముట్టడి చేశామని, పోలీసులను మొహరించి తమను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. సోయా కొనుగోళ్ళ కేంద్రాలను ప్రారంభించినప్పటికీ కొనుగోళ్ళు మాత్రం జరగడం లేదన్నారు.

అన్నదాతలకు అండగా బీఆ ర్‌ఎస్  పార్టీ నిలబడుతుందని,వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం తప్పదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు విజ్జగిరి నారాయణ, అజయ్, గండ్రత్ రమేష్, సెవ్వ జగదీ ష్, పవన్ నాయక్, సతీష్, ధమ్మపాల్, ప్రకాష్, ప్రశాంత్, కుమ్ర రాజు పాల్గొన్నారు.