26-11-2025 11:13:48 PM
యాంటీ ర్యాగింగ్ కమిటీ హెచ్చరించిన పట్టించుకొని సీనియర్స్
సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా అర్బన్ మండలంలోని మిట్టపల్లిలో గల సురభి మెడికల్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసినట్లు బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు కళాశాలలో విచారణ చేపట్టారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాయి కృష్ణ గడ్డం పెంచుకోవడాన్నీ సీనియర్ విద్యార్థులు వ్యతిరేకిస్తూ ర్యాంగింగ్ కు పాల్పడ్డారు. అయితే తనకు దేవుడి మొక్కు ఉందని అందుకే గడ్డం పెంచుకోవాల్సి వచ్చిందని బాధ్యత వైద్య విద్యార్థి వివరించినప్పటికీ సీనియర్స్ ఆగడాలు ఆగిపోలేదు.
విషయాన్ని యాంటీ ర్యాంగింగ్ కమిటీ సభ్యులకు వివరించారు. వారు సైతం ర్యాంగింగ్ పాల్పడిన విద్యార్థులకు హెచ్చరించినట్లు తెలిసింది. అయితే సీనియర్ విద్యార్థులు సాయి కృష్ణకు దగ్గర ఉండి గడ్డం గీయించారు. బాధిత విద్యార్థి విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే తమ కుమారునిపై ర్యాంకింగ్ పాల్పడ్డారని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసుల విచారణలో తేలిన వివరాలు మాత్రం వెల్లడించలేదు.