27-11-2025 12:00:00 AM
గుంటూరు ఏపీ గ్రామీణ బ్యాంక్‌లో నిర్వహణ
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): భారత రాజ్యాంగం ఆమోదించబడి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీసులో బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓఎస్‌డీ ఎం. అరుణ్ కుమార్, విజిలెన్స్ ఇంచార్జ్ హరిష్ బేత, జనరల్ మేనేజర్లు, అలాగే వివిధ విభాగాల సిబ్బంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా విజిలెన్స్ ఇంచార్జ్ హరిష్ బేత మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం సమగ్రత, స్థిరత్వం, సౌలభ్యత, మరియు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడం, వంటి అనేక కీలక లక్షణాలను కలిగి ఉందని పేర్కొన్నారు. ఓఎస్టీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కేవలం ఒక చట్టపరమైన పత్రం మాత్రమే కాకుండా, ప్రతి పౌరునికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని కల్పించే మార్గదర్శక వ్యవస్థ అని పేర్కొన్నారు.